దశాబ్దాలుగా అధికారంలో ఉన్నా అభివృద్ధి చేయని కాంగ్రెస్ పార్టీ మాయలో పడి మోసపోవద్దని,
ఆ పార్టీకి ఓటేస్తే కష్టాలు కొని తెచ్చుకోవడమేనని బీఆర్ఎస్ భువనగిరి అభ్యర్థి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. బీబీనగర్ మండలంలోని పలుగ్రామాల్లో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పైళ్ల మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో కరెంట్, సాగు, తాగునీటి కోసం అరిగోస పడ్డామని అన్నారు. బీఆర్ఎస్ను మరోసారి గెలిపిస్తే స్థానికంగా ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేస్తామని, బీబీనగర్ వరకు మెట్రో రైల్ విస్తరణ జరుగుతుందని తెలిపారు.
బీబీనగర్, నవంబర్ 17 : కాంగ్రెస్ మాయలో పడి ప్రజలు ఆగం కావొద్దని, ఆ పార్టీకి ఓటేస్తే కష్టాలు కొని తెచ్చుకోవడమేనని బీఆర్ఎస్ భువనగిరి అభ్యర్థి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని మక్తానంతారం, వెంకిర్యాల, పడమటిసోమారం, పల్లెగూడెం, మాధారం, రావిపహాడ్, రావిపహాడ్‌తండా, మగ్దుంపల్లి, గొల్లగూడెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను వివరిస్తూ కారు గుర్తకు ఓటేయాలని అభ్యర్థించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 24 గంటలు కరెంటిచ్చే బీఆర్ఎస్ కావాలా, 3 గంటలు చాలు అంటున్న కాంగ్రెస్ కావాలో రైతులే తేల్చుకోవాలన్నారు. సమైక్య రాష్ట్రంలో కరెంట్, సాగు, తాగునీటి కోసం అరిగోస పడ్డామని గుర్తు చేశారు. బీబీనగర్ ప్రాంతంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కానుందని, స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు దొరుకుతాయని తెలిపారు. బీబీనగర్ వరకు మెట్రో రైల్‌ను విస్తరించనుందని, మెట్రో వస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని వివరించారు.
భువనగిరి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి చూసి తనను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. అనంతరం వెంకిర్యాల గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన 40 మంది ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో ఎంపీపీ యర్కల సుధాకర్‌గౌడ్, జడ్పీటీసీ గోలి ప్రణితాపింగళ్‌రెడ్డి, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ బొక్క జైపాల్‌రెడ్డి, సర్పంచులు పసులాది లావణ్య, అరిగె సుదర్శన్, తలబోయిన గణేశ్‌యాదవ్, సప్పిడి భారతమ్మ, బానోతు మహేశ్, మందడి అలివేలు రాంరెడ్డి, ఆవుర్ల పద్మాశ్రీశైలం, గుండెబోయిన రమేశ్‌యాదవ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాసులు, గ్రామశాఖ అధ్యక్షులు రాములు, బలవంత్‌రెడ్డి, బాలరాజు, మాధవరెడ్డి, శంకరయ్య, గణేశ్, నాయకులు నరేందర్‌రెడ్డి, రమేశ్, లక్ష్మీనారాయణ, పార్టీ మండల మహిళాధ్యక్షురాలు పిట్టల శ్యామల పాల్గొన్నారు.