కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు చేసిందేమీ లేదని, కొత్తగా చేసేది కూడా లేదని బీఆర్ఎస్ భువనగిరి అభ్యర్థి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నాయకులు అసమర్థులని, 60 ఏండ్లలో అభివృద్ధి చేయని వారు ఇప్పుడేం చేస్తారని ప్రశ్నించారు. బీబీనగర్ మండలంలోని పలు గ్రామాల్లో గురువారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పైళ్ల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాతే గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. సాగు నీరు, 24 గంటలతో వ్యవసాయం పండుగలా మారిందని తెలిపారు. అన్ని వర్గాలకు అండగా నిలుస్తున్న బీఆర్ఎస్కు ఓటేసి గెలిపించాలని కోరారు. ప్రచారానికి వచ్చిన పైళ్లకు ప్రజలు ఘన స్వాగతం పలికారు.
బీబీనగర్, నవంబర్ 16 : అసమర్ధ కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి కొత్తగా చేసేదేమీ లేదని, 60 ఎండ్లలో చేయని అభివృద్ధి ఇప్పుడు కొత్తగా గెలిచి ఎట్ల చేస్తారని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ప్రశ్నించారు. మండలంలోని నెమరగోముల, రాయరావుపేట్, జమీలపేట్, జియాపల్లి, జియాపల్లితండా, మీదితండాలో కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
జియాపల్లిలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జిట్ట బాలకృష్ణారెడ్డి అనుచరులు 20 మంది ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అనంతరం జమీలాపేట్‌లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలకు ఓట్లు అడిగే హక్కు లేదని, కాంగ్రెస్ 60 ఏండ్ల పాలనలో చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.
ప్రజలు మరోసారి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ యర్కల సుధాకర్‌గౌడ్, జడ్పీటీసీ గోలి ప్రణితాపింగళ్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచులు జయమ్మావెంకటేశ్, ఆముదాల సుమతి, బొర్ర సంతోషరమేశ్, కొమ్మిడి ప్రేమలతాసుభాశ్రెడ్డి, వరిగంటి కుమార్, ఎంపీటీసీలు యర్కల విజయలక్ష్మీపాండురంగంగౌడ్, పార్టీ మండలాధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాసులు, కార్యదర్శి చింతల సుదర్శన్‌రెడ్డి, నాయకులు గాదె నరేందర్‌రెడ్డి, మెట్టు మోహన్‌రెడ్డి, కురిమిండ్ల కృష్ణారెడ్డి, మన్నె బాలరాజు, సంకూరి నాగరాజు, కొలను దేవేందర్‌రెడ్డి, సంకూరి నాగరాజు, జక్కి నగేశ్, వంశి, గుంటిపల్లి లక్ష్మీనారాయణ, పంజాల రమేశ్, చీర ఐలయ్య, సురకంటి సుధాకర్‌రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు పాండుగౌడ్, సుమన్, ఆముదాల పాండుగౌడ్, ఎరుకల సుమన్‌గౌడ్, మద్దెసాని రమేశ్ యాదవ్, ఎండీ యూసుఫ్, ధరావత్ గోవింద్, రమావత్ రాజు పాల్గొన్నారు.