నల్లగొండ : రజకుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ (MLA Nomula Bhagat) అన్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గం హాలియా మున్సిపాలిటీలో రూ. 2 కోట్లతో నిర్మించనున్న మోడ్రన్ దోభిఘాట్ (Modern Dhobighat) నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అన్ని కులాలు, కుల వృత్తులను కాపాడేందుకు ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారన్నారు.
రజకులకు ఇప్పటికే ప్రభుత్వం 250 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ (Free Power)అందిస్తుందని వెల్లడించారు. హైదరాబాద్ లో మూడు ఎకరాల స్థలం ఇచ్చి వారి ఆత్మగౌరవం నిలబెట్టారని తెలిపారు. ఈ కార్యక్రమం లో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ యడవెల్లి మహేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వీరా రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నల్గొండ సుధాకర్, కౌన్సిలర్లు నల్లబోతు వెంకటయ్య, ప్రసాద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.