మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూ నాయక్ అన్నారు. స్థానిక క్యాంప్ కార్యాలయంలో చందంపేట, నేరేడుగొమ్ము, డిండి, పీఏపల్లి, చింతపల్లి, మల్లేపల్లి మండలాలకు చెందిన 245 మందికి మంజూరైన కల్యాణ లక్ష్మి చెక్కులను గురువారంఆయన పంపిణీ చేసి మాట్లాడారు.
- ఎమ్మెల్యే బాలూనాయక్
- దేవరకొండలో కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ
చందంపేట(దేవరకొండ), మార్చి 7 : మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూ నాయక్ అన్నారు. స్థానిక క్యాంప్ కార్యాలయంలో చందంపేట, నేరేడుగొమ్ము, డిండి, పీఏపల్లి, చింతపల్లి, మల్లేపల్లి మండలాలకు చెందిన 245 మందికి మంజూరైన కల్యాణ లక్ష్మి చెక్కులను గురువారంఆయన పంపిణీ చేసి మాట్లాడారు. మహిళా సాధికారత దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. ఎన్నికల హామీలో భాగంగా మహిళలకు ఉచిత ఆర్టీ సీ బస్సు ప్రయాణం కల్పించినట్లు గుర్తు చేశారు.
రూ.500లకే గ్యాస్ సిలిం డర్, 200 యూనిట్ల ఉచిత కరెంటు పథకాలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలో కల్యాణలక్ష్మి పథకంలో భాగంగా త్వరలో తులం బంగారం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ప్రజాపాలన ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీరాములు, ఎంపీపీ జానీ యాదవ్, పార్వతీచందునాయక్, జడ్పీటీసీ బుజ్జి లచ్చిరాంనాయక్, దేవరకొండ తాసీల్దార్ సంతోష్కిరణ్, శ్రీనివాసులు, పీఏసీఎస్ చైర్మన్లు జాలె నర్సింహారెడ్డి, శ్రీశైలంయాదవ్, కొర్ర రాంసింగ్నాయక్, హరికృష్ణ, పాపానాయక్, సిరాజ్ఖాన్, ముక్కమల వెంకటయ్యగౌడ్, డీటీ సీఎస్, ఆర్ఐ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

