హాలియా/హాలియా/తిరుమలగిరి(సాగర్), ఏప్రిల్ 19 : భూ సమస్యల పరిష్కారం కోసమే రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టం తెచ్చిందని సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి అన్నారు. భూ భారతి చట్టంపై శనివారం అనుముల మం డలం కొత్తపల్లి గ్రామంలోని రైతు వేదికలో, పెద్దవూర మండల కేంద్రంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి ఆయన మాట్లాడారు. ఈ చట్టం ద్వారా అని సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ భూ భారతి ద్వారా 30 రోజుల్లో మ్యుటేషన్ చేయకపొతే 31వ రోజు ఆటోమెటిక్‌గా మ్యుటేషన్ అవుతుందన్నారు. బహుళ ప్రయోజనాలున్న ఈ చట్టం జూన్ 2 నుంచి రాష్ట్రంలో పూర్తిస్థ్ధాయిలో అమల్లోకి వస్తుందని తెలిపారు. రాష్ట్రంలో మొదటిసారిగా పైలట్ ప్రాజెక్టుగా తిరుమలగిరి(సాగర్)లో భూ సమస్యలను పరిష్కరించి రాష్ట్ర వ్యాప్తంగా భూ అమలు చేయడం సంతోషమన్నారు.
కార్యక్రమంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ, మాజీ జడ్పీటీసీ కర్నాటి లింగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్‌రెడ్డి, మండల ప్రత్యేకాధికారి భిక్షపతి, ఎంపీడీఓ సుజాత, కుందూరు వెంకట్‌రెడ్డి, వెంపటి శ్రీనివాస్, పెద్దవూరలో తాసీల్దార్ శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ కృష్ణారెడ్డి, లింగారెడ్డి, తిరుమలగిరి సాగర్‌లో తాసీల్దార్ అనిల్, మాజీ జడ్పీటీసీ కర్నాటి లింగారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శేఖర్, నాయకులు పాల్గొన్నారు.