నల్లగొండ : అమెరికాలోని మేరీల్యాండ్‌లో నల్ల జాతీయుల చేతిలో మరణించిన సాయి చరణ్ తల్లిదండ్రులను నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి బుధవారం పరామర్శించారు. పట్టణంలోని వివేకానంద నగర్ కాలనీలోని చరణ్ నివాసంలో ఘటన గురుంచి తెలుసుకుని వాటిని ఓదార్చారు.
చరణ్ తండ్రి రిటైర్డ్ హెడ్ మాస్టర్ నర్సింహ ఏకైక కుమారుడు. తన అక్క కూడా అమెరికాలో ఉండడంతో రెండున్నర సంవత్సరాల కిందట ఎమ్మెస్ కోసం చరణ్ అమెరికా వెళ్లినట్లు తల్లిదండ్రులు తెలిపారు. డెడ్ బాడీని అమెరికా నుంచి త్వరగా తెప్పించేందుకు ప్రభుత్వంతో మాట్లాడుతానని ఎమ్మెల్యే తెలిపారు.