సూర్యాపేట : రాజీపడని పోరాటయోధుడు కామ్రేడ్ ధర్మ భిక్షం గౌడ్ అని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. మాజీ ఎంపీ, కామ్రేడ్ బొమ్మగాని ధర్మ భిక్షం గౌడ్ 14 వ వర్ధంతి సందర్బంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అయన జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేసిన గొప్ప వ్యక్తి అని ప్రశంసించారు.
అయన పోరాటం భవిష్యత్ తరాలకు ఆదర్శనీయ అన్నారు. జీవిత కాలమంతా కమ్యూనిస్టుగానే జీవించిన గొప్ప నేత, విద్య ప్రాధాన్యతను గుర్తించి పోరాటం ప్రారంభించిన యోధుడని ప్రశంసించారు. నాయకత్వం, త్యాగం, సమాజసేవలో ఆయనది అలుపెరుగనిపోరాటామన్నారు. సూర్యాపేట జిల్లాకు అయన పేరు పెట్టగల సరైన అర్హుడు ధర్మ భిక్షం, ఈ విషయంలో నావంతు సహకారం తప్పకుండా ఉంటుందన్నారు.