సూర్యాపేట టౌన్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను లండన్ నగరంలోని టావిస్కాట్ స్కేర్‌లో అక్కడి ఎన్ఆర్ఓ బీఆర్ఎస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దీనికి మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇటీవల సొంత పనులపై లండన్ వెళ్లిన ఆయనకు అక్కడి తెలంగాణ ఉద్యోగులు, విద్యార్థులు, అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా తెలంగాణ అమరులకు కొవ్వొత్తుల ర్యాలీతో నివాళులర్పించారు. అలాగే తెలంగాణ పోరాటంలో అమరుల త్యాగాలను స్మరిస్తూ, తెలంగాణ జాతిపిత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉద్యమ పోరాటాలను గుర్తు చేస్తూ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో లండన్ బీఆర్ఎస్ శాఖ ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి, అధికార ప్రతినిధులు రేటినేని రవి, పులుసు రవిప్రదీప్, లండన్ ఇన్చార్జి బుడగం సురేశ్, కోశాధికారి గొట్టిముక్కల సతీశ్, కార్యదర్శి చిలుముల సత్య, బోనగిరి నవీన్, మామిడాల ప్రశాంత్ పాల్గొన్నారు.