అన్ని వర్గాల అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యం
అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమం టీఆర్ఎస్తోనే సాధ్యమని ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు.
- ఎమ్మెల్యే కిశోర్ సమక్షంలో పలువురి చేరిక
తిరుమలగిరి, నవంబర్ 30 : అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమం టీఆర్ఎస్తోనే సాధ్యమని ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. హైదరాబాద్‌లో బుధవారం ఆయన సమక్షంలో మండలంలోని వెలిశాల గ్రామపంచాయతీకి చెందిన కాంగ్రెస్ వార్డు సభ్యుడు ఎల్లంల అశోక్, నాయకులు కడారి మల్లేశ్, చంద్రయ్య, చీకటి వెంకన్న, మూల వీరారెడ్డి, ముత్తయ్య, లింగయ్యతో పాటు పలువురు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా పాలన అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని కొనియాడారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి పలువురు టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. తెలంగాణలో అందుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆకుల వీరయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రఘునందన్‌రెడ్డి, దూపటి రవీందర్ పాల్గొన్నారు.
శాలిగౌరారం మండలంలో..
శాలిగౌరారం : మండలంలోని ఎన్జీకొత్తపెల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గన్నపురెడ్డి లక్ష్మారెడ్డితో పాటు మరో 10కుటుంబాల వారు హైదరాబాద్‌లో ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని అందుకే పార్టీలో ఉవ్వెత్తున చేరుతున్నారన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఐతగోని వెంకన్నగౌడ్, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ గుండా శ్రీనివాస్, ఎంపీపీ సలహాదారుడు గంట శంకర్, చామల మహేందర్‌రెడ్డి, ఓగోటి శ్రీనివాస్, సిర్పంగి సత్యం పాల్గొన్నారు.
అడ్డగూడూరు : సీఎం కేసీఆర్ పాలనకు మద్దతుగా నిలిచేందుకు వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు.
హైదరాబాద్‌లోని బుధవారం ఆయన సమక్షంలో మండలకేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలెంల సురేశ్, పోలేపాక అబ్బులు, దాసరి వీరలక్ష్మి, గుత్తా వినోద, పసునూరి లక్ష్మి, బాలెంల దేవయ్య, బోడ పాండుతో పాటు 100మంది కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. అందరి సహకారంతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు. బంగారు తెలంగాణలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

