నకిరేకల్, అక్టోబర్ 16 : సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని గడపగడపకూ చేరవేద్దాం..మనల్ని ఆదరించేవారే తప్ప..కాదనేవారు ఎవరూ ఉండరని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఆర్ఎస్ నుంచి బీఫామ్ అందుకున్న చిరుమర్తి లింగయ్య మొదటిసారిగా నకిరేకల్‌కు వచ్చిన సందర్భంగా వివిధ మండలాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చి ఎమ్మెల్యేకు సోమవారం కనకదుర్గ ఆలయం వద్ద స్వాగతం పలికారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రచార రథంలో కనకదుర్గ ఆలయం నుంచి సాయిబాబా ఆలయం వరకు ర్యాలీగా వెళ్లి సాయిబాబాను దర్శించుకుని తిరిగి మెయిన్ సెంటర్లో బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని ప్రతి గడపకు చేరే విధ ంగా నాయకుడు, కార్యకర్త ముందుకుసాగాలన్నారు. మాయమాటలు చెప్పే కాంగ్రెస్ నాయకులను పాతరేయాలన్నారు. కాంగ్రెస్‌లో టికెట్ల కొట్లాటలు, అంతర్గత కుమ్ములాటలు తప్ప మరేం ఉండదన్నారు. కాంగ్రెస్‌కు దిమ్మతిరిగే మ్యానిఫెస్టోను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారన్నారు. రూ.1,200 ఉన్న గ్యాస్ సిలిండర్‌ను రూ.400కే ఇస్తామని, సౌభాగ్యలక్ష్మి పథకం పేద మహిళలకు రూ.3 వేలు ఇచ్చే కార్యక్రమం మహిళలు సంతోషపడే విధంగా మ్యానిఫెస్టో ఉందన్నారు. మూడోసారి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు.
బీఆర్ఎస్ శ్రేణులను చూస్తే సంతోషంగా ఉంది
నకిరేకల్ ఎన్నికల ఇన్చార్జి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ శ్రేణుల ప్రభంజనం చూసి పట్టలేని సంతోషంగా ఉందన్నారు. ఏ సర్వేలు చూసినా గెలిచేది చిరుమర్తి లింగయ్యనే వస్తుందన్నారు. ఐదేండ్లు కంటినిండ నిద్రపోకుండా నియోజకవర్గంలో అభివృద్ధ్ది కోసం అహర్నిశలు కష్టపడ్డ వ్యక్తి మన లింగన్న అని కొనియాడారు. నకిరేకల్ నియోజకవర్గంలో మాజీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎంపీగా తాను ఉన్నానని, జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి ఉన్నాడని, గుత్తా సుఖేందర్‌రెడ్డి ఇలా అందరి ఆశీస్సులతో మరోసారి చిరుమర్తి ఎమ్మెల్యేగా గెలిపించుకుందామన్నారు. చిరుమర్తి లింగయ్యను మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే మిగిలి ఉన్న అభివృద్ధ్దిని కొనసాగిస్తారన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రేగట్టే మల్లికార్జున్‌రెడ్డి, జడ్పీటీసీలు మాద ధనలక్ష్మీనగేశ్గౌడ్, బొప్పని స్వర్ణలతాసురేశ్, తరాల బలరాం, ఎంపీపీలు సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, కొలను సునీతావెంకటేశ్, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల ప్రదీప్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ పల్రెడ్డి మహేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రగడపు నవీన్‌రావు, ప్రధాన కార్యదర్శి నోముల కేశవరాజు పట్టణాధ్యక్షుడు యల్లపురెడ్డి సైదిరెడ్డి, కౌన్సిలర్లు చౌగోని అఖిల లక్ష్మణ్, చౌగోని రాములమ్మా సైదులు, కందాల భిక్షంరెడ్డి, రాచకొండ సునీల్, గర్షకోటి సైదులు, బానోతు వెంకన్న, చింత స్వాతి త్రిమూర్తులు, పల్లె విజయ్, పోతుల సునీతారవీందర్, నాయకులు చల్లా కృష్ణారెడ్డి, సోమయాదగిరి, పాల్గొన్నారు.
‘ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి ’
చిట్యాల : ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పిలుపునిచ్చారు. మండలంలోని గుం డ్రాంపల్లి గ్రామంలో సోమవారం బీఆర్ఎస్ ము ఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. గ్రామ స్థాయిలో నాయకులు, కార్యకర్తలు అభిప్రాయబేధాలను పక్కకకు పెట్టి కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. అదే విధంగా బూత్ కమిటీల బాధ్యులు ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించాలని అన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి చెందిన 50 మంది ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు.
చెర్వుగట్టులో ఎమ్మెల్యే చిరుమర్తి పూజలు
నార్కట్‌పల్లి : సీఎం కేసీఆర్ చేతులమీదుగా బీఫామ్ తీసుకొని సోమవారం చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామిని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య దర్శించుకున్నారు. ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఎన్నికల ప్రచార రథాలను పూజలు చేసి ప్రారంభించారు. చెర్వుగట్టు గ్రామంలో మహిళలు ఎమ్మెల్యే నుదుటిపై కుంకుమ దిద్ది మంగళ హారతులతో స్వాగతం పలికారు. గ్రామ ంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 100 శాతం నెరవేర్చాలని తమరు మరోసారి అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధ్ది పరుస్తానని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ యానాల అశోక్ రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బైరెడ్డి కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు.