చిట్యాల, నవంబర్ 13 : కాంగ్రెస్కు ఓటు వేస్తే 3గంటల కరెంట్, రైతుబంధు, రైతు బీమా పథకాలు రద్దుచేసి రైతుల జీవితాల్లో కారుచీకట్లు నింపుతారని బీఆర్ఎస్ నకిరేకల్ అభ్యర్థ్ధి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.మండలంలోని వెలిమినేడు లో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.బీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ మరిన్ని పథకాలు అమలు కావాలంటే మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్నే గెలపించాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ నమ్ముకుంటే అమ్ముకున్నట్లేనని విమర్శించారు. కాంగ్రెస్ అభ్యర్థిని గతంలో ఆదరిస్తే ఏమి చేశాడో చెప్పాల్సిన అవసరం లేదని, నియోజకవర్గంలో ఆయన అరాచకాలు అన్ని ఇన్నీ కాదని మరోసారి గెలిపిస్తే ఏమి జరుగుతుందో ప్రజలే ఆలోచించుకోవాలని అన్నారు. అభివృద్ధే లక్ష్యంగా పనిచేసే నన్ను గెలిపిస్తే ఐదేళ్లలో నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధ్ది చేసింది కళ్ల ముందే కనిపిస్తుందని, నియెజకవర్గ అభివృద్ధ్ది కోసమే తాను పార్టీ మారిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చెరుకు సుధాకర్ మాట్లాడుతూ అభివృద్ధ్ది అంటే ఎలా ఉం టుందో పదేండ్లలో చూపించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలోని బీఆర్ఎస్ పార్టీకే ప్రజలందరూ ఓటు వేయాలని అన్నారు. కార్యక్రమాల్లో ఎంపీపీ కొలను సునీత, జడ్పీటీసీ సుంకరి ధనమ్మ, పీఏసీఎస్ చైర్మన్ రుద్రారపు భిక్షపతి, బీఆర్ఎస్ మండల అధ్యక్షప్రధాన కార్యదర్శులు ఆవుల అయిలయ్య, కల్లూరి మల్లారెడ్డి, మాజీ జడ్పీటీసీ శేపూరి రవీందర్, వెలిమి నేడు ఉపసర్పంచ్ మచ్చేందర్, గ్రామ శాఖ అధ్యక్షుడు అరూరి శ్రీశైలం, మాజీ సర్పంచు మద్దెల మల్లయ్య పాల్గొన్నారు.
బీఆర్ఎస్కు మరోసారి పట్టం కట్టాలి
సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని అందరికీ సంక్షేమ ఫలాలు అందలంటే మరోసారి బీఆర్ఎస్కు పట్టం కట్టాలని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మండలంలోని నార్కట్పల్లి, షాపల్లి, బెండల్ పహాడ్, పల్లె పహాడ్, బాజకుంట గ్రామాల్లో ఆదివారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అక్కడి ప్రజలు నుదుటిపై కుంకుమ దిద్ది డప్పు చప్పుళ్లతో కోలాటాల మధ్య చిరుమర్తికి స్వాగతం పలికారు. ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఓటును అభ్యర్థ్దించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నార్కట్పల్లి మండలాన్ని అన్ని రంగానల్లో అభివృద్ధి చేశానని రూ. 16 కోట్లతో నార్కట్పల్లి పట్టణం మోడల్ సిటీగా త్వరలో తయారవుతుందని తెలిపారు. రోడ్డు విస్తరణ సెంట్రల్ డివైడర్ ఏర్పాటుతో పట్టణం రూపుదిద్దుకుంటుందని అన్నారు.కాంగ్రెస్ హామీలను నమ్మితే కర్ణాటక ప్రజలు నష్ట పోయినట్లే నష్ట పోవాల్సి వస్తుందన్నారు. కాంగ్రెస్ నాయకుల మాయ మాటలు నమ్మి మోసపోకుండా ఆలోచించి అభివృద్ధి, సంక్షేమం సుస్థిరంగా కొనసాగించే బీఆర్ఎస్ ప్రభుత్వానికి మరోసారి అవకాశం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ యానాల అశోక్ రెడ్డి, బీఆర్ఎస్ మండల, పట్టణాధ్యక్షులు బైరెడ్డి కరుణాకర్ రెడ్డి, దోసపాటి విష్ణు, ఎంపీటీసీలు పుల్లెంల ముత్తయ్య, చిరుమర్తి యాదయ్య, మేకల రాజిరెడ్డి, కల్మెకొలను లక్ష్మమ్మ, చిర్రబోయిన సావిత్రి కుమారస్వామి, కనుకు అంజయ్య, సర్పంచ్ కర్నాటి ఉపేందర్, సతీశ్ రెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.