నల్లగొండ : జిల్లాలోని నార్కట్పల్లి మండలం అక్కెనపల్లి గ్రామంలో 5వ విడత పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా రూ.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శుక్రవారం నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శంకుస్థాపన చేశారు.
గ్రామంలో రూ.20 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.అనంతరం మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మంచినీటి సరఫరా, టాయిలెట్స్, ప్రహరీ, ఇతర అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.