నల్లగొండ : కులవృత్తిని నమ్ముకున్న కల్లుగీసే గౌడన్నలను నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య ఆప్యాయంగా పలకరించారు. కట్టంగూర్ మండలంలోని తూర్పుబాయిగూడెంలో పార్టీ కార్యకర్త కుటుంబ సభ్యులు మరణించగా హాజరై తిరుగు ప్రయాణంలో గౌడన్నలను చూసి తన వాహనాన్ని ఆపి వారితో మాట్లాడారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వారితో మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో సరైనా గుర్తింపులేక తీవ్ర నష్టపోయారని, గీత కార్మికుల కష్టాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ వారికి పెద్దపీట వేశారని అన్నారు.
కుల వృత్తిని ప్రోత్సహించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు, ప్రమాద బీమా సౌకర్యం కల్పించారని అన్నారు. అనంతరం గీత కార్మికుల కోరిక మేరకు రేఖ పట్టి, కల్లు తాగి ఎమ్మెల్యే వారిని సంతృప్తి పరిచారు.