వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండ చూడాలి
రానున్న వేసవికాలంలో నియోజకర్గంలో తాగునీటి సమస్య లేకుండా చూడాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అధికారులను ఆదేశించారు.
- మిర్యాలగూడ ఎమ్మెల్యే బీఎల్ఆర్
మిర్యాలగూడ, జనవరి 24: రానున్న వేసవికాలంలో నియోజకర్గంలో తాగునీటి సమస్య లేకుండా చూడాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అధికారులను ఆదేశించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వా రు పాల్గొని మాట్లాడారు. అనంతరం అవంతీపురంలోని మిషన్ భగీరథ ప్లాంట్ను పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, మిషన్ భగీరథ ద్వారా నీరు సరిగా రాకపోవడంతో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతు న్నారన్నారు. ప్రజలకు తాగునీటి ఎద్దడి లేకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. పరిశుభ్రమైన తాగునీటిని అందించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని సూచించారు. ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఈఈ వంశీకృష్ణ, పాపారావు, డీఈ సంపత్కుమార్, అన్వర్, పాల్గొన్నారు.
మిర్యాలగూడ మున్సిపాలిటీ ఆదర్శంగా తీర్చిదిద్దాలి
మిర్యాలగూడటౌన్ : మిర్యాలగూడ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దేలా అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు.బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ తిరునగరు అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశానికి అడిషనల్ కలెక్టర్ హేమంత్పాటిల్, ఆర్డీఓ చెన్నయ్యతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని వీధిలైట్లు, మురుగు కాల్వలు, రోడ్లు, డ్రైనేజీలను శుభ్రంగా ఉండేవిధంగా చూడాలని అన్నారు. నల్లగొండ రోడ్డులోని ఈద్గా వద్ద ప్రహరీ నిర్మించాలని కోరారు.
గత ప్రభుత్వంలో నిలిచిపోయిన పనులను పూర్తిచేయాలన్నారు. కరెంట్ సమస్యలను పరిష్కరించాలని,స్ట్రీట్లైట్లను ఆవసరం ఉన్నచోట వేయించాలని కోరారు. చైర్మన్ తిరునగరు భార్గవ్ మాట్లాడుతూ త్వరలో శానిటేషన్ విభాగాన్ని ప్రక్షాళన చేస్తామని అన్నారు. కార్యక్రమంలో ము న్సిపల్ కమిషనర్ పూర్ణచందర్,మిషన్ భగీరథ ఎస్ఈ వెంకటేశ్వర్లు, డిప్యూటీడీఎంహెచ్ఓ కేసా రవి, ఎంపీడీఓ జ్యోతిలక్ష్మి పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

