దేవరకొండ, జూన్ 17 : దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రిని ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ బుధవరాం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితులు, అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రిలో రోగులకు అందిస్తున్న భోజన వసతులను పరిశీలించి, భోజనం నాణ్యత ఎలా ఉందని రోగులను అడిగి తెలుసుకున్నారు. రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని, అవసరమైన మందులు, సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే పేద, మధ్యతరగతి ప్రజల పట్ల వైద్యులు, సిబ్బంది మానవతా దృక్పథంతో వ్యవహరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.