మిర్యాలగూడ టౌన్, మార్చి 21 : ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఎంప్లాయిస్ జాతీయ స్థాయి ఖో ఖో పోటీలకు మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామానికి చెందిన ఫిజికల్ డైరెక్టర్ బచ్చలకూరి శివ ఎంపికయ్యాడు. నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం జడ్పీహెచ్ఎస్ పడమటిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శివ ఫిజికల్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు.
ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఖో ఖో ఫైనల్ సెలక్షన్స్ లో నల్లగొండ జిల్లా తరఫున పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరచడంతో జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ నెల 21 నుండి 24వ తేదీ వరకు న్యూఢిల్లీలోని వినయ్ మార్గ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మైదానంలో జరిగే ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ జాతీయ స్థాయి ఖో ఖో పోటీల్లో తెలంగాణ రాష్ట్ర సివిల్ ఎంప్లాయిస్ పురుషుల ఖో ఖో జట్టు తరఫున శివ ఆడనున్నాడు.