మిర్యాలగూడ, అక్టోబర్ 25 : అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం సోషల్ మీడియా వారియర్స్ ప్రధాన పాత్ర పోషించాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. బుధవారం పట్టణంలోని ఎస్వీ గార్డెన్స్‌లో నిర్వహించిన నియోజకవర్గస్థాయి బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ ప్రతినిధుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులు, ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.
దాంతో పాటు ప్రత్యర్థులు చేస్తున్న దుష్ప్రచారాన్ని వెంటనే తిప్పికొట్టాలన్నారు. ఈ నెల 31న జరిగే ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరవుతున్నందున 70 వేలకు పైగా ప్రజలను సమీకరించాలన్నారు. అనంతరం బీఆర్ఎస్ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ దినేశ్‌చౌదరి మాట్లాడుతూ బీఆర్ఎస్ రాష్ట్ర సోషల్ మీడియా వార్ రూమ్ నుంచి వచ్చే ప్రతి కంటెంట్‌ను వారియర్స్ ఫాలో కావాలన్నారు. రాజకీయ లబ్ది కోసం ప్రత్యర్థులు చేసే ఫేక్ న్యూస్ ప్రచారాలను తిప్పి కొట్టాలన్నారు.
కార్యక్రమంలో యూత్ మోటివేటర్ మహేంద్ర గురూజీ, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణరెడ్డి, బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు నల్లమోతు సిద్ధార్థ, ఏఎంసీ చైర్మన్ బైరం బుచ్చయ్య, వైస్ చైర్మన్ కుందూరు వీరకోటిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ జెర్రిపోతుల రాములుగౌడ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు నామిరెడ్డి కరుణాకర్‌రెడ్డి, పాలుట్ల బాబయ్య, మట్టపల్లి సైదులుయాదవ్, డీసీసీబీ డైరెక్టర్ బంటు శ్రీనివాస్, ఏఎంసీ డైరెక్టర్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.