చిట్యాల, జూన్ 30 : రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు శుక్రవారం చిట్యాలలో బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. మహబూబాబాద్ పర్యటన అనంతరం చిట్యాల మీదుగా హైదరాబాద్‌కు వెళ్తుండగా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున గులాబీ పూలు చల్లుతూ ఆహ్వానించారు. పటాకులు పేల్చి జై కేటీఆర్.. జై బీఆర్ఎస్ అంటూ నినాదాలు చేశారు.
రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు శుక్రవారం చిట్యాలలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. మహబూబాబాద్‌లో బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం హైదరాబాద్‌కు వెళ్తున్న కేటీఆర్‌కు చిట్యాలలో కొద్ది సేపు ఆగారు. ఈ సందర్భంగా పటాకులు కాల్చుతూ కేటీఆర్‌పై గులాబీ పూలు చల్లుతూ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేటీఆర్ తన వాహనం నుంచి దిగి ప్రజలకు అభివాదం చేసి వెళ్లారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన వెంకట్‌రెడ్డి, నార్కట్‌పల్లి, రామన్నపేట ఎంపీపీలు సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, కన్నెబోయిన జ్యోతీ బలరాం, చిరుమర్తి తనయుడు మనోజ్‌కుమార్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పొన్నం లక్ష్మయ్య, జిట్ట చంద్రకాంత్, మండల ప్రధాన కార్యదర్శి కల్లూరి మల్లారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, కౌన్సిలర్లు, నాయకులు మందడి ఉదయ్‌రెడ్డి, మెండె సైదులు, వనమా వెంకటేశ్వర్లు, దాసరి నర్సింహ, గుండెబోయిన సైదులు పాల్గొన్నారు.