నల్లగొండ, మార్చి 24 : ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణిలో ఈ వారం తాను పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరిస్తానని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించడంతో పెద్ద ఎత్తున బాధితులు నల్లగొండ కలెక్టరేట్‌కు చేరుకున్నారు. మంత్రి రాక కోసం ఉదయం 10:30 గంటల నుండి బాధితులు మధ్యాహ్నం 2:30 గంటల వరకు ఎదురు చూశారు.
అయితే నల్లగొండ, తిప్పర్తి మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన తర్వాత మధ్యాహ్నం 1:30 గంటలకే మంత్రి కలెక్టరేట్ చేరుకొని కలెక్టర్ ఛాంబర్లో కూర్చున్నారు. కాగా మంత్రి మాత్రం సమావేశ మందిరంలో వినతులు స్వీకరించేందుకు మాత్రం వెళ్లలేదు. మంత్రి రాక కోసం ఎదురుచూసిన బాధితులు ఆయన సమావేశ మందిరంలోకి రాకుండా వెళ్లిపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు.
Minister Komatireddy : వినతులు స్వీకరించకుండానే వెళ్లిన మంత్రి కోమటిరెడ్డి