నల్లగొండ : నర్సరీలో వినూత్న ప్రయోగాలు సృష్టిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన సంగారెడ్డికి చెందిన గంగా నర్సరీ నిర్వాహకులు మామిడిలో సరికొత్త వంగడాన్ని సృష్టించారు. మామిడి పేరు వినపడగానే నోరూరించే బంగినపల్లి మామిడిని పోలి ఉండే ఈ వంగడానికి గంగా అని పేరు పెట్టారు.
ఈ మేరకు హార్టికల్చర్ రంగంలో విశిష్ట గుర్తింపు ఉన్న గంగా నర్సరీ అధినేత ఐ.సి. మోహన్ ఆ వంగడాన్ని సోమవారం విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తో ఆవిష్కరింప జేశారు. ఆధునిక పరిజ్ఞానంతో ఫార్మ్ హౌజ్‌లకు సరికొత్త డిజైన్లను రూపొందించే మోహన్ మామిడిలో నూతన వంగడాన్ని సృష్టించడం అద్భుత ప్రయోగమని మంత్రి జగదీష్ రెడ్డి అభివర్ణించారు.