రామగిరి, సెప్టెంబర్ 6: ఎన్ఎస్ఎస్ జాతీయ సమైక్యత శిబిరానికి ఎంపికైన వలంటీర్లు సత్తాచాటి ఎంజీయూ ఖ్యాతి నిలుపాలని ఎంజీయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ పి.మద్దిలేటి సూచించారు. శుక్రవారం ఎంజీయూలో నిర్వహించిన ఎంపికకు ఉమ్మడి జిల్లాలోని వలంటీర్లు రావడంతో వారికి పలు అంశాలల్లో ఇంటర్వ్యూలు నిర్వహించిన ఉత్తమ ప్రతిభ చూపిన వారిని ఎంపిక చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈనెల 17 నుంచి బెంగళూర్‌లో నిర్వహించే శిబిరానికి పంపిస్తున్నట్లు వెల్లడించారు.
ఎంపికైన వలంటర్లు వీరే..
– పురుషుల విభాగంలో-పి.శివప్రసాద్ -ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నల్లగొండ, ఆర్.రంగసాయి-ఎంజేపీటీబీసీడబ్ల్యూ-సాగర్, ఎస్.బన్నీ ప్రభుత్వ జూనియర్ కళాశాల నార్కట్‌పల్లి, విష్ణువర్ధన్- ప్రభుత్వ జూనియర్ కళాశాలత నారాయణ్‌పూర్, నాగార్జున ప్రభుత్వ జూనియర్ కళాశాల, భూదాన్ పోచంపల్లి
మహిళా విభాగంలో..
ఎన్.నందిని ప్రభుత్వ జూనియర్ కళాశాల సంస్థాన్ నారాయణ్‌పూర్, ఐ.రూప ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలికలు దేవరకొండ, కె.అంజలి టీఎస్ఎంఎస్ జూనియర్ కళాశాల గుర్రంపోడు, ఐ.నందిని ప్రభుత్వ జూనియర్ కళాశాల భూదాన్ పోచంపల్లి, అక్షర ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలికలు దేవరకొండ.