– ఈ నెల 10 వరకు రీవాల్యూయేషన్, రీకౌంటింగ్‌కు అవకాశం
రామగిరి, జూలై 02 : మహాత్మాగాంధీ యూనివవర్సిటీ ఆధ్వర్యంలో నల్లగొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న కళాశాలలోని డిగ్రీ విద్యార్థులకు నిర్వహించిన పలు సెమిస్టర్ ఫలితాలను బుధవారం వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్పేన్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అల్వాల రవి, పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ జి.ఉపేందర్‌రెడ్డి విడుదల చేశారు. ఫలితాలను www.mguniversity.ac.inలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఈ నెల 10వ తేదీ వరకు రీవాల్యూయేషన్, రీకౌంటింగ్ అవకాశం ఉందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కంట్రోలర్స్ డాక్టర్ లక్షీప్రభ, డాక్టర్ ప్రవళిక, పరీక్షల విభాగం కో ఆర్డినేటర్ డాక్టర్ భిక్షమయ్య పాల్గొన్నారు.
– ప్రథమ సెమిస్టర్‌కు 6,071మంది హాజరుకాగా 1,321మంది ఉత్తీర్ణత సాధించారు. 4,722 మంది ప్రమోట్ కాగా 28 మందిని మాల్ ప్రాక్టిస్‌లో ఉంచగా 21.76 శాతం ఫలితాలు వచ్చాయి.
– ద్వితీయ సెమిస్టర్‌కు 10,413 మంది హాజరు కాగా 2,453 మంది ఉత్తీర్ణత సాధించారు. 6,636 మంది ప్రమోట్ కాగా 36 మందిని మాల్ ప్రాక్టిస్‌లో ఉంచగా 23.56 శాతం ఫలితాలు వచ్చాయి.
– మూడో సెమిస్టర్‌కు 5,112 మంది హాజరు కాగా 1,589 మంది ఉత్తీర్ణత సాధించారు. 3,499 మంది ప్రమోట్ కాగా 24 మందిని మాల్ ప్రాక్టిస్‌లో ఉంచగా 31.08 శాతం ఫలితాలు వచ్చాయి.
– నాల్గొవ సెమిస్టర్‌కు 8,664 మంది హాజరు కాగా 3,123 మంది ఉత్తీర్ణత సాధించారు. 5,270 మంది ప్రమోట్ కాగా 34 మందిని మాల్ ప్రాక్టిస్‌లో ఉంచగా 36.05 శాతం ఫలితాలు వచ్చాయి.
– ఐదో సెమిస్టర్‌కు 4,172 మంది హాజరు కాగా 1,545 మంది ఉత్తీర్ణత సాధించారు. 2,613 మంది ప్రమోట్ కాగా 14 మందిని మాల్ ప్రాక్టిస్‌లో ఉంచగా 37.03శాతం ఫలితాలు వచ్చాయి.
– ఆరో సెమిస్టర్‌కు 8,488 మంది హాజరు కాగా 3,910 మంది ఉత్తీర్ణత సాధించారు. 4,557 మంది ప్రమోట్ కాగా 21 మందిని మాల్ ప్రాక్టిస్‌లో ఉంచగా 46.07 శాతం ఫలితాలు వచ్చాయి.