– ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హాజరు కానున్న 20,211 మంది విద్యార్థులు
– సీఓఈ డా.జి.ఉపేందర్‌రెడ్డి
రామగిరి, ఏప్రిల్ 06 : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 7 నుండి డిగ్రీ వివిధ సెమిస్టర్ రెగ్యూలర్, బ్యాక్లాగ్ పరీక్షలు ప్రారంభమవుతున్నట్లు సీఓఈ డా. జి.ఉపేందర్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు 2, 4, 8వ సెమిస్టర్ రెగ్యూలర్, బ్యాక్లాగ్ పరీక్షలు జరుగుతాయన్నారు. అదే విధంగా మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు 1. 3, 5వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. వీరి కోసం ఉమ్మడి జిల్లాలో 23 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా నల్లగొండ జిల్లాలో 11, సూర్యాపేటలో 8, యాదాద్రి భువనగిరి జిల్లాలో 3 పరీక్ష కేంద్రాలు ఉన్నట్లు తెలిపారు. అన్ని సెమిస్టర్లకు కలిపి 20,211 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు వెల్లడించారు. వీరిలో 2వ సెమిస్టర్‌కు 8,500 మంది. 4వ సెమిస్టర్‌కు 8,110, 3వ సెమిస్టర్‌కు 5,801 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు.