రామగిరి, మే 8 : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో గత నెలలో జరుగాల్సిన డిగ్రీ పలు సెమిస్టర్స్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలను వాయిదా వేసిన విషయం విదితమే. ప్రభుత్వం ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలకు ఫీజు రీయింబర్స్మెంట్స్, స్కాలర్షిప్లను విడుదల చేయకపోవడంతో అప్పులు చేసి కళాశాలలను నిర్వహించలేని ఆయా కళాశాలల యాజమాన్యాలు పరీక్షలను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశాయి.
ప్రభుత్వం నుంచి స్పష్టతరానప్పటికీ విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఎంజీయూ అధికారులు ఈ నెల 14 నుంచి పరీక్షల నిర్వహణకు గురువారం షెడ్యూల్‌ను విడుదల చేశారు. షెడ్యూల్ విడుదలతో పైనల్ ఇయర్ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే కళాశాలల యాజమాన్యాలకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ అల్వాల రవి, సీఓఈ జి.ఉపేందర్‌రెడ్డి పాల్గొన్నారు.