రామగిరి, అక్టోబర్ 23 : నల్లగొండలోని మహాత్మాగాందీ యూనివర్సిటీ బీఈడీ పలు సెమిస్టర్ ఫలితాలు గురువారం వెల్లడయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న బీఈడీ కళాశాలలో చదివే బీఈడీ చాత్రోపాధ్యాయులకు సెప్టెంబర్ 2025లో నిర్వహించిన పలు సెమిస్టర్స్ రెగ్యూలర్, బ్యాక్లాగ్ పరీక్షల ఫలితాలను వర్సిటీలో వీసీ ప్రొ॥ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్టర్ ప్రొఫెసర్ అల్వాల రవితో కలిసి సీవోఈ డా.జి.ఉపేందర్‌రెడ్డి విడుదల చేశారు. 4వ, 2వ సెమిస్టర్ రెగ్యూలర్/బ్యాక్లాగ్, 1, 3వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షల ఫలితాలను వర్సిటీ వెబ్సైట్ www.mgamiversity.ac in లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీవోఈ మాట్లాడుతూ.. రివాల్యూయేషన్ కోసం దరఖాస్తు ఫలితాలు వెల్లడించిన నాటి నుండి 15 రోజుల్లో కళాశాలల ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సీవోఈలు డా.లక్ష్మీప్రభ, డాక్టర్ సంద్యారాణి, డాక్టర్ ప్రవళిక, డాక్టర్ రామచంద్రం, పరీక్షల విభాగం సిబ్బంది పాల్గొన్నారు.