కట్టంగూర్, మే 05 : దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. సోమవారం కట్టంగూర్‌లో జరిగిన గంగదేవమ్మ పండుగలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకుని భక్తి మార్గం వైపు నడువాలన్నారు. ప్రతి ఒక్కరూ గ్రామ దేవతలను పూచించాలన్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే వీరేశంను ఆలయ కమిటీ సభ్యులు శాలువాలతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీలు సుంకరబోయిన నర్సింహ్మ, మాద యాదగిరి, నాయకులు బచ్చులపల్లి గంగాధర్‌రావు, పెద్ది సుక్కయ్య, రెడ్డిపల్లి సాగర్, ముక్కాముల శేఖర్, మిట్టపల్లి శివ, గట్టిగొర్ల సత్తయ్య, సుంకరబోయిన గంగాధర్, ముక్కాముల యాదయ్య, ముక్కాముల అంజయ్య, సుంకరబోయిన అశోక్ పాల్గొన్నారు.