సూర్యాపేట, జనవరి 14 : సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం చెన్నకేశవపురం గ్రామం పెరిక సంఘం నూతన కమిటీని బుధవారం ఎన్నుకున్నారు. గ్రామ పెరిక సంఘం అధ్యక్షుడిగా మేకల గోవర్ధన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా మేకల రమేశ్, గౌరవ సలహాదారులుగా మేకల యల్లయ్య, మేకల కృష్ణయ్య, దేవరగట్ల వెంకటేశ్వర్లు, మేకల కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శిగా దేవరగట్ల వీర శేఖర్, కోశాధికారిగా మేకల చిన్న లక్ష్మయ్య, కార్యదర్శులుగా మేకల వెంకటేశ్వర్లు, బాదే వంశీ, గొల్ల సైదులు, దేవరగట్ల సతీశ్, కందిబండ నరసింహారావు, మేకల రమేశ్‌ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు సముద్రాల రాంబాబు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట పట్టణ అధ్యక్షుడు పత్తిపాక వేణుదర్, సహాధ్యక్షుడు యర్రంశెట్టి రామలింగయ్య, సంయుక్త కార్యదర్శి నట్టే కిరణ్ కుమార్, కుల పెద్దలు, యూత్ సభ్యులు పాల్గొన్నారు.