రామగిరి, జూలై 03 : నల్లగొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో గల విశ్వబ్రాహ్మణ విద్యార్థి వసతి గృహంలో ఈ నెల 5న సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ (బొట్టుగూడ, నల్లగొండ) వారి సహకారంతో ఉచిత మెగా హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ ప్రతినిధులు తెలిపారు. శుక్రవారం విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ జిల్లా అధ్యక్షుడు దాసోజు యాదగిరి చారి, ప్రధాన కార్యదర్శి పెందోట సోము ఇందుకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వైద్య శిబిరం ఈ 5వ తేదీన ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు కొనసాగనున్నట్లు తెలిపారు. ఈ క్యాంప్‌లో ప్రముఖ నిపుణులైన డాక్టర్ సయ్యద్ అబ్దుల్ ముఖీత్ (ఇంటర్నల్ మెడిసిన్), డాక్టర్ చౌర వినయ్ కుమార్ (జనరల్ & లాపరోస్కోపిక్ సర్జన్), డాక్టర్ సంతోష్ (క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్), డాక్టర్ ఎన్.వరుణ్ సాయి (మెడికల్ సూపరింటెండెంట్) చే వైద్య పరీక్షలు నిర్వహించబడతాయన్నారు.
అన్ని రకాల సాధారణ వ్యాధులకు ఉచితంగా వైద్య సలహాలు, సూచనలు అందించడమే కాకుండా షుగర్, రక్త పరీక్షలు, బి.పి, ఈసిజి పరీక్షలు చేయబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ జిల్లా గౌరవాధ్యక్షుడు శ్రీపాద కృష్ణమాచారి, ఆర్థిక కార్యదర్శి తరునోజు భీష్మాచారి, క్యాంప్ నిర్వహణ సహాయ కార్యదర్శి కటకం వెంకటాచారి, చీఫ్ అడ్వైజర్ కంచనపల్లి షణ్ముఖ చారి, కార్యవర్గ సభ్యుడు కూరెల్ల రాఘవాచారి, ఆచారి మోరా షణ్ముఖ చారి, సొల్లేటి లక్ష్మణ్ పాల్గొన్నారు.