నల్లగొండ, మార్చి 30 : ఏప్రిల్ 5, 14వ తేదీలలో జరిగే బాబు జగ్జీవన్ రావ్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా కార్యక్రమాలు రూపొందించేందుకు ఈ నెల 31న మధ్యాహ్నం 3 గంటలకు నల్లగొండ కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ సోమవారం తెలిపారు. ఈ సమావేశానికి షెడ్యూలు కులాలు, తెగల సంఘాల ప్రజా ప్రతినిధులు హాజరై తమ అభిప్రాయాలను తెలుపాలని ఆయన కోరారు. అదేవిధంగా జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని పేర్కొన్నారు.