నీలగిరి, జూలై 16 : సఫాయి కార్మికుల ఆరోగ్య రక్షణకు తగిన చర్యలు చేపడుతున్నట్లు నల్లగొండ మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తెలిపారు. నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకో సిస్టమ్ (నమస్తే) డే లో భాగంగా బుధవారం కమిషనర్ చాంబర్లో సఫాయి మిత్ర కార్మికులకు ఆయుష్మాన్ ఆరోగ్య కార్డులు, భద్రత పరికరాలు, పీపీఈ కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నమస్తే కార్యక్రమంలో పారిశుధ్య కార్మికులతో పాటు ఘన వ్యర్ధాలను సేకరించే వారిని, స్వయం సహాయ సంఘం సభ్యులు, స్థానిక కమ్యూనిటి సభ్యులను కూడా కేంద్ర ప్రభుత్వం భాగస్వాములను చేసినట్లు తెలిపారు.
పారిశుధ్య పనులు, ఘన వ్యర్థాలు సేకరించే సమయంలో కార్మికులు అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉన్నందున, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంపూర్ణ అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అదనపు కమిషనర్ రవీందర్‌రెడ్డి, డీఈ ఆశోక్, శానిటరీ ఇన్స్పెక్టర్లు నంద్యాల ప్రదీప్‌రెడ్డి, శ్రీనివాస్, పర్యవరణ ఇంజినీర్ వి.సతీశ్‌రెడ్డి, ఐటీసీ ఇన్చార్జి మనోహర్ పాల్గొన్నారు.