నల్లగొండ విద్యా విభాగం (రామగిరి), మే 20 : నల్లగొండ జిల్లా దేవరకొండలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల గణిత అధ్యాపకుడు చెరుకు నాగరాజు రచించిన మాథ్స్ ఫర్ ఆల్ పుస్తకాన్ని నల్లగొండ-ఖమ్మం-వరంగల్ టీచర్ నియోజకవర్గ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి మంగళవారం హైదరాబాద్లోని పీఆర్టీయూ భవనంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ సులువైన పద్దతిలో ఆసక్తిగా గణిత ప్రక్రియలను, భావనలు, సూత్రాలు నేర్చుకోవడమే గాక అన్వయించే విధంగా “మ్యాథ్స్ ఫర్ ఆల్” పుస్తకం ఉందన్నారు.
ప్రోగ్రెసివ్ మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు తరాల జగదీశ్ మాట్లాడుతూ.. విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఆలోచించి వారి గణితం అభివృద్ధికి దీర్ఘ దృష్టితో ఆలోచించి మంచి పుస్తకాన్ని అందించిన పుస్తక రచయిత నాగరాజుకు అభినందనలు తెలిపారు. మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల తరుపున సన్మానించారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు గుండు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి పులగం దామోదర్ రెడ్డి, రాష్ట్ర అసోసియట్ అధ్యక్షుడు సోమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పీఎంటీఏ టీఎస్ రాష్ట్ర కన్వీనర్ సయ్యద్ సలీమ్, ఉపాధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.
MLC Pingali Sripal Reddy : ‘మ్యాథ్స్ ఫర్ ఆల్’ పుస్తకావిష్కరణ