నల్లగొండ, అక్టోబర్ 22 : మైనర్ బాలికను మభ్యపెట్టి బలవంతంగా పెళ్లి చేసుకున్న కేసులో నల్లగొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నల్లగొండ పట్టణ సమీపంలోని పానగల్లుకు చెందిన గురిజాల చందు అనే వ్యక్తి బాలికను మభ్యపెట్టి పెండ్లి చేసుకున్నాడని 2022లో నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదు అయింది. విచారణలో పూర్తి సాక్ష్యాధారాలు, సైంటిఫిక్ ఎవిడెన్స్ పరిశీలించిన అనంతరం దోషికి 32 ఏండ్ల జైలు శిక్ష, రూ.75 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి రోజారమణి బుధవారం తీర్పు వెలువరించారు. అలాగే బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించారు.