పాలకవీడు, జులై 03 : విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాద సంఘటన సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం మిగడంపాడు తండాలో గురువారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సపవత్ బిచ్చ (45) అనే వ్యక్తి గ్రామంలో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ రైతుకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్లను పరిశీలించడానికి వెళ్లగా ఎడ్జ్ ఫీజ్ వైరు తెగిపడి ఉండడాన్ని చూసుకోకపోవడంతో కరెంట్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. బిచ్చాకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.