తిప్పర్తి, జూన్ 19 : పొలం దున్నుతుండగా ట్రాక్టర్ తిరుగబడి రైతు మృతి చెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం తిప్పలమ్మగూడెం గ్రామంలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రైతు దేవిరెడ్డి వెంకట్‌రెడ్డి (51) తన పొలాన్ని ట్రాక్టర్‌తో దున్నుతుండగా దిగబడడంతో అది తీసే సమయంలో ట్రాక్టర్ ముందు భాగం లేచి తిరుగబడింది. దీంతో ట్రాక్టర్ సీట్లో ఉన్న వెంకట్‌రెడ్డి నాగళ్ల మధ్య ఇరుక్కపోయాడు. బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకట్‌రెడ్డికి భార్య సరిత, కొడుకు, కూతురు ఉన్నారు. భార్య సరిత ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ ఎస్.రామూర్తి కేసు నమోదు చేశారు.