రామగిరి, జూన్ 11 : ప్రముఖ సాహితీవేత్త మేరెడ్డి యాదగిరి రెడ్డి యాభై ఏళ్ల సాహిత్య జీవితం – సమాలోచన సదస్సు నల్లగొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జూన్ 13 నాడు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తున్నామని సృజన సాహితీ అధ్యక్షుడు పెరుమాళ్ల ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు కార్యక్రమ గోడ పత్రికను పట్టణానికి చెందిన కవులు ఆవిష్కరించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజన్యంతో నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రారంభ సభకు ఆ సంస్థ కార్యదర్శి డా.నామోజు బాలాచారి, సాయంత్రం జరిగే ముగింపు సభకు భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డా.ఏనుగు నరసింహా రెడ్డి హాజరువుతారని ఆయన పేర్కొన్నారు.
నాలుగు సెషన్స్ గా జరిగే ఈ సదస్సులో మేరెడ్డి కథా సాహిత్యం – పరిశీలన అనే అంశం పై శీలం భద్రయ్య, ‘మేరెడ్డి కవిత్వం – రైతు జీవితంపై డా.పొట్టబత్తుల రామకృష్ణ, ‘మేరెడ్డి బాల సాహిత్యం’ పై డా.ఉప్పల పద్మ, ‘మేరెడ్డి మినీ కవిత్వం – వస్తు శిల్పాలు’ అంశంపై డా.సి.అనిత కుమారి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో డా.నాళేశ్వరం శంకరం, ప్రొఫెసర్ బెల్లి యాదయ్య, డా.తండు కృష్ణ కౌండిన్య, మునాసు వెంకట్, డా.పురుషోత్తమాచార్య, బైరెడ్డి కృష్ణారెడ్డి డా. సాగర్ల సత్తయ్య పాల్గొంటారని తెలిపారు. కవులు కళాకారులు సాహిత్య విద్యార్థులు, పరిశోధకులు కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు.