తుంగతుర్తి, ఏప్రిల్ 22 : ఈ నెల 27న వరంగల్‌లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు గుజ్జ యుగంధర్‌రావు అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలోని ప్రతి గ్రామం నుండి కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య, జిల్లా నాయకుడు గుండగాని రాములు గౌడ్, మట్టిపల్లి శ్రీశైలం, దొంగరి శ్రీను, గుండగాని దుర్గయ్య, గౌడిచర్ల సత్యనారాయణ, గోపగాని శ్రీను, బొజ్జ సాయి కిరణ్, కొండగడుపుల వెంకటేశ్, బొంకూరి మల్లేశ్, గోపగాని వెంకన్న, బొంకూరి సాయి పాల్గొన్నారు.