కట్టంగూర్, జూలై 22 : అరుణోదయ వ్యవస్థాపక సభ్యుడు, విప్లవ సాంస్కృతిక ఉద్యమ నాయకుడు కామ్రేడ్ అరుణోదయ నాగన్న సంతాప సభకు కళాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనాలని అఖిత భారత రైతు కూలీ సంఘం నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు గజ్జి రవి, పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి పజ్జూరి ఉపేంద్ర పిలుపునిచ్చారు. బుధవారం కట్టంగూర్ మండలంలోని ఈదులూరు గ్రామంలో నాగన్న సంతావ సభ పోస్టర్ ను సంఘం నాయకులతో కలిసి ఆవిష్కరించి మాట్లాడారు. ప్రజా కళారూపాలు, బుర్రకథలు, జానపద గీతాల ద్వారా నాగన్న ప్రజల్లో చైతన్యం నింపారని కొనియాడారు. ఈ నెల 25న హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించే సంతావ సభకు కళాభిమానులు అధిక సంఖ్యలో హాజరై నివాళులర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బూరుగు సత్తయ్య, పెరక శారద, సముద్రాల సైదమ్మ, వండెపల్లి చంద్రయ్య, గద్దపాటి అంజయ్య, హుస్సేన్ పాల్గొన్నారు.