‘ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి’
ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్త మంజులామాధవరెడ్డి అన్నారు. శుక్రవారం కట్టంగూర్ మండలంలోని కురుమర్తి, పిట్టంపల్లి, మునుకుంట్ల గ్రామాల్లో పీఏసీఎస్, ఐకేపీ, ఎన్టీసీఎంఎస్ ఆధ్వర్యంలో...
– నకిరేకల్ ఏఎంసీ చైర్మన్ గుత్తా మంజులామాధవరెడ్డి
కట్టంగూర్, అక్టోబర్ 30 : ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్త మంజులామాధవరెడ్డి అన్నారు. శుక్రవారం కట్టంగూర్ మండలంలోని కురుమర్తి, పిట్టంపల్లి, మునుకుంట్ల గ్రామాల్లో పీఏసీఎస్, ఐకేపీ, ఎన్టీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్య కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. రైతులు తమ ధాన్యాన్ని దళారులకు అమ్మకుండా నేరుగా ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం విక్రహించి ఏ గ్రేడ్ కు రూ.2461, బీ గ్రేడ్ కు రూ.2441 మద్దతు ధర పొందాలని సూచించారు. కేంద్రాల్లో రైతులకు అసౌకర్యం కలగకుండా తగిన వసతులు కల్పించడంతో పాటు కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లర్లకు తరలించాలన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మాద యాదగిరి, ఎంపీడీఓ గంట అంజన్ రెడ్డి, ఏఓ గిరి ప్రసాద్, పీఏసీఎస్ సీఈఓ బండ మల్లారెడ్డి, ఏపీఎం నరహరి, ఆయా గ్రామాల సర్పంచులు దార సత్తెమ్మభిక్షం, వాణికేశవులు, ఎన్న మౌనిక వెంకట్ రెడ్డి, గుల్లి నరేష్, తోటకూరి జలేంద్ర, కుంభం అనిల్ రెడ్డి, ఉప సర్పంచ్ కడారి మల్లేష్, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు సుంకరబోయిన వెంకన్న, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు గుండు పరమేష్, బండారు కృష్ణ, నాయకులు గద్దపాటి దానయ్య, అయితగోని నారాయణ, మాద సైదులు, మిట్టపల్లి శివ, కొంపెల్లి శ్రీకాంత్, రెడ్డిపల్లి స్వామి, పొలిశెట్టి వెంకటేశ్వర్లు, నిమ్మనగోటి లింగస్వామి, కుందారపు వెంకట్ రెడ్డి, నూకల శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి’
Telangana | కన్నీళ్లు కాలువలై పారుతున్నా..! తడవని మడి
‘గుర్రంపోడు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి’
Helicopter Crash | ఆ హెలికాప్టర్ కూలిపోయింది.. పైలట్ సహా ఆరుగురు దుర్మరణం..!
Anant Singh | బహిష్కృత జేడీ(యూ) ఎమ్మెల్యే అనంత్ సింగ్‌కు సుప్రీంకోర్టులో నిరాశ.. డిసెంబర్ 1 లోగా లొంగిపోవాలని ఆదేశం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

