గుడిపల్లి, ఏప్రిల్ 02 : గుడిపల్లి మండలంలోని కేశంనేనిపల్లి గ్రామ పంచాయతీలో గత రెండు రోజుల నుండి రేషన్ షాపులో తుట్టెలు కట్టిన బియ్యం, పురుగుల బియ్యం అలాగే ఎలుకల మల విసర్జనతో కూడిన దొడ్డు బియ్యం ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఉచితంగా ఒక వ్యక్తికి 6 కేజీల చొప్పున సన్న బియ్యం ఇస్తున్నాం అని చెబుతుంది కానీ ఇక్కడ మాత్రం గతంలో మిగిలిపోయిన, నిల్వ ఉన్న దొడ్డు బియ్యంను రేషన్ డీలర్ గత రెండు రోజుల నుండి ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. సుమారుగా 10 క్వింటాల బియ్యం పంపిణీ చేయడం జరిగింది. ఇదేంటని ప్రజలు రేషన్ డీలర్ ను ప్రశ్నించగా ఈ దొడ్డు బియ్యం అయిపోతేనే మరలా బియ్యం వస్తాయని చెబుతున్నారు. ఈ బియ్యం తినేది ఎలా అని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. దానికి రేషన్ డీలర్ బియ్యాన్ని తీసుకుపోయి బర్రెలకు, పశువులకు పెట్టుకోవాలని చెప్పడం కొసమెరుపు.