నకిరేకల్, ఆగస్టు 09 : నకిరేకల్‌కి చెందిన లిటిల్ సోల్జర్స్ టీం రక్షా బంధన్ రోజు చిన్నారి పాప వైద్య చికిత్సకు సాయం అందించి పెద్ద మనస్సు చాటుకుంది. జనగామ జిల్లా ఘాన్పూర్ మండలం ఇప్పగూడెంకు చెందిన దీకొండ ప్రభాకర్ – అనూషల కూతురు ప్రణవి (3) న్యూమోనియా, హార్ట్ బ్లాక్ సమస్యతో బాధపడుతుంది. రోజు డయాలసిస్‌తో హైదరాబాద్‌లోని ఎల్బీనగర్లో గల అంకుర హాస్పిటల్ చికిత్స పొందుతుంది. డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారన్న విషయం తెలిసిన నకిరేకల్‌కి చెందిన లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్ మిత్రులు శనివారం ఆస్పత్రికి వెళ్లి పాప చికిత్సకు రూ.22,200 సాయం అందించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మదేవర నరేశ్, కర్నాటి నరేశ్, బట్టిపల్లి వెంకన్న, బొల్లేని నవీన్, బాణోతు రవి పాల్గొన్నారు.