మునుగోడు, జూలై 26 : మునుగోడు మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఎలైట్ నల్లగొండ ఆధ్వర్యంలో శనివారం షూస్, బెల్ట్, టై, ఐడి కార్డులు పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్లగొండ ఎలైట్ గవర్నర్ మదన్ మోహన్ రేపాల మాట్లాడుతూ.. లయన్స్ క్లబ్ ఎలైట్ 200 దేశాల్లో పనిచేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు టీచర్లు, తల్లిదండ్రులు చెప్పింది విని మంచి స్థాయికి ఎదగాలని, ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎలైట్ సభ్యులను, అతిథులను పాఠశాల సిబ్బంది శాలువాలతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఎంఈఓ తలమల్ల మల్లేశం, పాఠశాల హెచ్ఎం, లయన్ సుంకరి భిక్షం గౌడ్, బాతరాజు అంజయ్య, పాల్వాయి హరిప్రసాద్, ఇంద్రకంటి ఇంద్రారెడ్డి, ఉప్పల రవికుమార్, అద్దంకి సునిల్, పీఆర్టీయూ మునుగోడు మండల అధ్యక్ష, కార్యదర్శులు యూసుఫ్ పాషా, మేకల అన్నపురెడ్డి, రాష్ట్ర నాయకులు వెంకన్న గౌడ్, కళావతి, ఎలైట్ సభ్యులు మల్వాల మల్లయ్య, గోవింద్ రెడ్డి, బోయపల్లి వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ రెడ్డి, రాంరెడ్డి, రాంబాబు, పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Munugode : మునుగోడు ఎంపీపీఎస్కు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్లగొండ ఎలైట్ చేయూత