రామగిరి, సెప్టెంబర్ 26: మైనర్‌పై లైంగిక దాడి, ఆమె ఆత్మహత్యకు కారణమైన నిం దితుడికి జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ శుక్రవారం నల్లగొండ జిల్లా కోర్టు రెండో అదనపు, ఎస్సీ, ఎస్టీ అండ్ స్పెషల్ పోక్సోకోర్టు న్యాయమూర్తి రోజా రమణి తీర్పు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే…యాదాద్రిభువనగిరి జిల్లా నారాయణపురం మండ లం సర్వేల్ గ్రామానికి చెందిన నిందితుడు కట్టెల సైదులు పదో తరగతి చదవే లైంగిక దాడికి పాల్పడడంతో అవమానం భరించలేక బాధితురాలు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది.
ఈ విషయంపై 2019 జూన్ 13న చిట్యాల పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. కోర్టు లో నేరం రుజువుకావడంతో నిందితుడికి జీవిత ఖైదు, రూ.65 వేల జరిమానా విధి స్తూ తీర్పు వెల్లడించారు. కేసులో సాక్ష్యాధారాలు సేకరంచి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసిన సీఐలు నరేందర్, శంకర్‌రెడ్డి, ఎస్ఐ రాములు, నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి, నార్కట్‌పల్లి సీఐ నాగరాజు, చిట్యాల ఎస్ఐ రవికుమార్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మేముల రంజిత్, లైజన్ అధికారులు మల్లికార్జున్, నరేందర్‌లను జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అభినందించారు.
నల్లగొండ జిల్లాతోపాటు ఇతర ప్రాంతా ల్లో దాదాపు 18 కేసుల్లో నిందితుడైన నల్లపరాజు రాజేశ్ అలియాస్ మెండల్ రాజేశ్‌కు జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ నల్లగొండ జిల్లా కోర్టు మూడోఅదనపు న్యాయమూర్తి, ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి దుర్గాప్రసాద్ శుక్రవారం సంచలనాత్మక తీర్పు వెల్లడించారు. నల్లగొండ జిల్లా కేం ద్రానికి చెందిన వివాదాస్పద వ్యక్తి నలపరాజు రాజేశ్ అలియాస్ మెంటల్ రాజేశ్‌తో పాటు పెరిక సాయితేజ @ టిల్లులపై నల్లగొండ టూటౌన్ పోలీసుస్టేషన్లో హత్య కేసు నమోదు చేశారు.
కోర్టులో విచారణ అనంతరం వారికి జీవిత ఖైదుతోపాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ తప్పు చేస్తే ఎంతిటివారికైనా శిక్ష తప్పదన్నారు. నిందితులకు శిక్షణపడేలా కృషి చేసిన సీఐలు రవీందర్, మనోహర్‌రెడ్డి, నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి, సీఐ రాఘవరావు, ఎస్ఐ సైదులు,ఫ్యామి లీ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జవహర్లా ల్, సీడీవో సుమన్, కోర్టు అధికారులు న రేందర్, మల్లికార్జున్‌ను అభినందించారు.