నల్లగొండ, జనవరి 7: మహిళలు స్వ శక్తితో ఎదుగాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నల్లగొండలో శిక్షణ పొందిన మహిళలు జననీ, మాతృశ్రీ సంస్థల్లో టైలరింగ్, బ్యూటీషియన్లలో ట్రైనింగ్ పొందిన వారికి కుట్టుమిషన్లు, బ్యూటీషియన్ కిట్లను ట్రస్ట్ చైర్మన్, బీఆర్ఎస్ యువ నాయకుడు గుత్తా అమిత్ రెడ్డితో కలిసి ఆదివారం అందజేశారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ పని చేస్తుందని అమిత్ రెడ్డి అన్నారు. మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం ఉంటేనే కుటుంబాన్ని ముందుకు నడపగలరని అన్నారు. కార్యక్రమంలోకనగల్ జడ్పీటీసీ చిట్ల వెంకటేశం, కౌన్సిలర్ యామ కవిత, అభిమన్యు శ్రీనివాస్, బీఆర్ఎస్ సీనియర్ నేతలు యామ దయాకర్, ఐతగోని స్వామి గౌడ్, గోపాల్ రెడ్డి, వెంకటేశ్వర రావు, హరికృష్ణ, ఇంద్రసేనా రెడ్డి ,రాధాకృష్ణ పాల్గొన్నారు.