రామగిరి, అక్టోబర్ 25 : నిరంతర పఠనంతోనే న్యాయవాదులు కేసులను సరిగ్గా నిర్వహించగలుగుతారని వరంగల్ సీనియర్ న్యాయవాది జి.విద్యాసాగర్ రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ బార్ అసోసియేషన్లో న్యాయవాదులకు వివిధ చట్టాల పట్ల అవగాహన పెంచేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ఆర్ట్ అఫ్ క్రాస్ ఎగ్జామినేషన్ అలాగే భారతీయ సాక్ష్య అధినియంపై అవగాహన కల్పించారు. మారుతున్న చట్టాల పట్ల న్యాయవాదులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. హైకోర్టు న్యాయవాది బి.భరత్ మాట్లాడుతూ.. ఆర్టిఫిషయల్ ఇంటలిజెన్స్ ఉపయోగించి న్యాయవాదులు మంచి ఫలితాలు పొందవచ్చని తెలిపారు.
నల్లగొండ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కట్టా అనంత రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి మంద నగేశ్, ఐఏఎల్ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మగాని ప్రభాకర్, బార్ కౌన్సిల్ సభ్యుడు దుస్స జనార్దన్, సీనియర్ న్యాయవాదులు మునగాల నారాయణ రావు, గుండె వెంకటేశ్వర్లు, మల్లేపల్లి ఆదిరెడ్డి, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు జి.జవహర్లాల్, జి.వెనత రమణారెడ్డి, ప్రభుత్వ న్యాయవాది నాంపల్లి నర్సింహా, ఐఏఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.వెంకన్న, న్యాయవాదులు పాల్గొన్నారు.