రామగిరి, ఫిబ్రవరి 03 : మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని సంవత్సరం వారి ప్రాతిపదికన 2011- 12 విద్యా సంవత్సరం నుండి 2015-16 విద్యా సంవత్సరం బ్యాక్లాగ్ విద్యార్థులకు చివరి అవకాశం కల్పించనున్నట్లు వర్సిటీ సీఓఈ డా.ఉపేందర్ రెడ్డి తెలిపారు. పరీక్ష ఫీజు చెల్లింపునకు ఆలస్య రుసుం లేకుండా మార్చి 4వ తేదీ వరకు చెల్లించవచ్చునని తెలిపారు. 100 రూపాయల ఆలస్య రుసుముతో మార్చి 6వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. రెండు సబ్జెక్టుల లోపు పరీక్ష రుసుము చెల్లించేవారు- బీఏ విద్యార్థులు రూ.625, బీకాం, బీకాం కంప్యూటర్స్ రూ.675, బీఎస్సీ విద్యార్థులు రూ.675 చెల్లించాలన్నారు. మూడు సబ్జెక్టులకు పైబడిన బీఏ విద్యార్థులు రూ.950, బీకాం, బీకాం కంప్యూటర్స్ రూ.1,015, బీఎస్సీ రూ.1,015 చెల్లించాలన్నారు. పూర్తి వివరాలకు ఎంజీయూ వెబ్సైట్ లేదా సంబంధిత కళాశాలను సంప్రదించ్చవని పేర్కొన్నారు.