ప్రగల్భాలు మాని రైతు సమస్యలు పరిష్కరించండి.. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ధ్వజం
మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రగల్భాలు మాని నియోజకవర్గంలోని రైతుల సమస్యలు పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం చౌటుప్పల్ మండలం చిన్నకొండూరులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సీపీఎం నాయకులతో కలసి సందర్శించి, రైతుల సమస్యలు తెలుసుకున్నారు.
- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ధ్వజం
చౌటుప్పల్ రూరల్,మే 3 : మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రగల్భాలు మాని నియోజకవర్గంలోని రైతుల సమస్యలు పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం చౌటుప్పల్ మండలం చిన్నకొండూరులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సీపీఎం నాయకులతో కలసి సందర్శించి, రైతుల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నెల రోజులుగా మునుగోడు నియెజక వర్గంలో కల్లాల్లో పోసిన ధాన్యపు రాశులు ఎక్కడివి అక్కడే ఉన్నాయని అన్నారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందన్నారు.
గత ప్రభుత్వం రైతులను కంటి రెప్పలా చూసుకుందని, రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించి, మద్దతు ధర చెల్లించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అనేక రకాల హమీలు ఇచ్చి అమలు చేయలేక ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం తీసుకొచ్చిన రైతుబంధు, రైతు భరోసా పథకాలకు కాంగ్రెస్ సర్కార్ పంగనామాలు పెట్టిందన్నారు. గొప్పలు చెప్పుకునే ఎమ్మెల్యే రాజగోల్రెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు. క్వింటాల్‌కు 8 కిలోలు ధాన్యం కోత విధించి రైతుల కష్టాన్ని కాంగ్రెస్ నాయకులు దోచుకుంటున్నారని అవేదన వ్యక్తం చేశారు.
పదవులపై ఉన్న ధ్యాస రైతు సమస్యలపై లేదని, ఉంటే రైతులను ఇబ్బందులకు గురి చేసేవాడు కాదని, రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం పోసి నెల రోజులవుతున్నా కోనేవాడు లేడని, ఇందుకు ఎమ్మెల్యే సిగ్గుపడాలని అన్నారు. వారం రోజుల్లో ప్రభుత్వం రైతు సమస్యలు పూర్తిగా పరిష్కరించాలని, లేకపోతే అఖిలపక్షం ఆధ్వర్యంలో ఐదువేల మంది రైతులతో ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్‌రెడ్డి, బీఆర్ఎస్ మున్సిపల్ కన్వీనర్ బొమ్మిరెడ్డి వెంకట్‌రెడ్డి, బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కొయ్యాడ శేఖర్, సర్పం చ్ గుండెబోయిన శిరీషా ఇస్తారి యాదవ్, శ్రీనివాస్‌గౌడ్. సీపీఎం నాయకులు కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

