చండూరు, అక్టోబర్ 09 : మార్వాడి గోబ్యాక్ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్గా నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూర్ రెవిన్యూ డివిజన్ పరిధిలోని తుమ్మలపల్లి గ్రామానికి చెందిన కురుపాటి సుదర్శన్ నియమితులయ్యారు. గురువారం ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి చేతుల మీదుగా ఆయన నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా సుదర్శన్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని మార్వాడీలు పీడిస్తున్న విధానాన్ని పిడమర్తి రవి పసిగట్టి మార్వాడి గో బ్యాక్ ఉద్యమాన్ని రచించి ఆ ఉద్యమంలో తనకు క్రియాశీలక పాత్ర అప్పగించడంపై కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. మార్వాడి గో బ్యాక్ ఉద్యమంలో తన వంతు క్రియాశీలక పాత్ర పోషిస్తానని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.

Chandur : మార్వాడి గోబ్యాక్ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్గా కురుపాటి సుదర్శన్