చందంపేట, జూలై 23 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ తెలిపారు. బుధవారం స్థానికంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకల్లో పార్టీ శ్రేణులు, మండల, జిల్లా స్థాయిలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.