సూర్యాపేట, జూలై 24: ఐటీ, మున్సిపల్ శాఖల మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్లా శాసనసభ్యుడు కల్వకుంట్ల తారకరామారావు పుట్టినరోజు వేడుకలను సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా గురువారం ఘనంగా నిర్వహించారు. సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రాలతో పాటు ఆయా మండలాలు, గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు కేక్ కట్‌చేసి సంబురాలు నిర్వహించా రు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేటీఆర్ పుట్టినరోజు వేడుకల్లో మాజీ రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ హాజరై బీఆర్ఎస్ శ్రేణులతో కలసి కేక్ కట్ చేసి కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మొట్ట మొదటి ఐటీ మంత్రి కేటీఆర్ ప్రపంచ దేశాల నుంచి తెలంగాణకు పెట్టుబడులు తీసుకొచ్చి తెలంగాణాను దేశానికి దిక్సూచిగా మార్చాడన్నారు. తండ్రి కేసీఆర్‌కు తగ్గ తనయుడిగా అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి తెలంగాణలోని పట్టణాలతో పాటు ప్రతి గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దాడన్నారు.
తెలంగాణలో ఐటీని అభివృద్ధ్ది చేసి లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించిన ఘనత కేటీఆర్‌దే అన్నారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేలా ప్రతి కార్య కర్త కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, మాజీ జడ్పీటీసీ జీడి భిక్షం, మాజీ ఎంపీపీ నెమ్మాది భిక్షం, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు సవరాల సత్యనారాయణ, బూర బాలసైదులు, ఆత్మకూర్‌ఎస్, పెన్పహాడ మండల అధ్యక్షులు తూడి నర్సింహారావు, దొంగరి యు గంధర్, ఆకుల లవకుశ, బత్తుల రమేశ్, ఎస్కె.రఫీ, ముదిరెడ్డి అనిల్‌రెడ్డి, ముదిరెడ్డి సంతోష్‌రెడ్డి, దేశగాని శ్రీనివాస్, బత్తుల ప్రసాద్, పల్స వెంకన్న, మీన య్య, తాహేర్, పూర్ణ శశికాంత్, కట్ల మురళి తదితరులు పాల్గొన్నారు.