యాదాద్రి భువనగిరి, జూలై 5 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కన్నెపల్లి పంపుహౌస్ సందర్శన కోసం వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు భువనగిరిలో ఆదివారం పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని వివేరా హోటల్లో అల్పాహారం స్వీకరించేందుకు ఆగిన కేటీఆర్‌కు కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, గాదరి కిశోర్ కుమార్, చిరుమర్తి లింగయ్య, నలమోతు భాస్కర్ రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగబాలు కేటీఆర్‌ను సాదరంగా ఆహ్వానించారు.
పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. కేటీఆర్ వస్తున్నారనే విషయం తెలిసి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో హోటల్ ప్రాంగణమంతా గులాబీమయంగా మారింది. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, బీఆర్ఎస్ నాయకులు జడల అమరేందర్, జనగాం పాండు, ఏవీ కిరణ్, రచ్చ శ్రీనివాస్ రెడ్డి, బీకే మల్లయ్య, శెట్టి బాలయ్య, కేశపట్నం రమేష్, తదితరులు పాల్గొన్నారు.

యాదగిరిగుట్ట, జూలై 5 : జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కన్నెపల్లి పంప్‌హౌస్‌కు వెళ్తున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఘన స్వాగతం లభించింది. ఆదివారం మండలంలోని బాహుపేట స్టేజీ వద్ద ప్రభుత్వ మాజీ విప్, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో వచ్చిన పార్టీ కార్యకర్తలతో కేటీఆర్ ముచ్చటించారు. అనంతరం ఆయన పంపుహౌస్‌కు బయల్దేరి వెళ్లారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి రామిరెడ్డి, సర్పంచులు కవిడే మహేందర్, గడ్డం దేవేందర్, మారెడ్డి కొండల్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ తోటకూరి అనురాధ, మాజీ సర్పంచ్ బీరయ్య, పలుగుల నవీన్‌కుమార్, పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి, యువజన విభాగం అధ్యక్షుడు ముక్యర్ల సతీశ్ యాదవ్, మున్సిపల్ మాజీ చైర్మన్ వస్పరి శంకర్, మాజీ ఎంపీపీ క్యాసగల్ల అనసూయ, మహిళా నాయకులు సోలిపురం అరుణ, నాయకులు లింగం యాదవ్, శారాజీ రాజేశ్, గంధమల్ల మధు, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.